తెలంగాణలో పాజిటివ్ కేసులు గురువారం అనూహ్యంగా పెరిగాయి. బుధవారం ఆరు కేసులు నమోదయినట్లు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒక్కరోజే 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. దీంతో.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 700కి పెరిగాయి. గురువారం కరోనా బారిన పడి కోలుకున్న 68 మందిని డిశ్చార్జ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 186 మందిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపింది.
తెలంగాణలో ఇప్పటివరకు 18 మంది కరోనా వల్ల మృతి చెందారు. ఇక్కడ మరో విషయమేంటంటే… గురువారం కొత్తగా నమోదైన 50 కేసుల్లో 90 శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనివేనని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో కరోనా ఉధృతికి ఈ ప్రకటన అద్దం పడుతోంది.