కరోనా … ఈ వ్యాధి చాలా మంది జీవితాలను అస్తవ్యస్తం చేస్తుంది . రోజు వారీ కూలీలు , వలస కార్మికులకు రోజు గడవడమే కష్టంగా మారింది . ఈ ఆపద సమయంలో చాలా మంది సామాన్య ప్రజలు , ప్రభుత్వాలు , సెలెబ్రిటీలు వారిని ఆదుకుంటూ సమాజం పట్ల ఉన్న బాధ్యతను తెలుపుతున్నారు . ఈ కోవలోనే ఉన్నారు డాక్టర్ గజల్ శ్రీనివాస్ .
“మాస్ట్రో” డా౹౹ గజల్ శ్రీనివాస్ గారి ఆర్ధిక సహాయంతో గజల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు గజల్ శ్రీనివాస్
సేవాసమితి ఆధ్వర్యంలో కొరోన వలన ఇబ్బంది పడుతున్న 250 మంది పేద ప్రజలకు,పారిశుద్ధ్య కార్మికులకు గత రెండు రోజులుగా భోజన పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.