ప్రపంచం అంతటా అనేక రకాలైన ప్రాణాపాయ రోగాలు పేట్రేగిపోతున్నాయి . చాలా వరకూ ఈ రోగాలు ముదిరిపోయిన తరువాత బయటపడుతున్నాయి . అప్పుడు వైద్య సహకారం అందించినా ఆశించిన తీరులో ఫలితాలు రావడంలేదు . ఇప్పుడు ప్రపంచమంతా భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ కూడా ఈ కోవకు చెందినదే . ఈ వైరస్ ను ఎదుర్కొనడం వైద్య శాస్త్రానికి పెద్ద సవాలుగా మారింది . అంతకంతకూ పెరిగిపోతూ ఎందరినో బలి తీసుకుంటోంది .

ఇలాంటి ప్రాణాంతక వ్యాధుల లక్షణాలు ముందే పసిగట్టగలిగితే ఈ వ్యాధి తీవ్రతను చాలా వరకూ తగ్గించుకోవచ్చు . వైద్య శాస్త్రానికే పెను సవాలుగా మారిన వ్యాధులకు టెక్నాలజీ ద్వారా చెక్ పెట్టొచ్చని యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన ఒక ప్రఖ్యాత కంపెనీ వర్గాలు చెబుతున్నాయి . తాము తయారు చేసిన ఒక సాంకేతిక పరికరం ద్వారా ప్రాణాంతక వ్యాధుల లక్షణాలను ముందే పసిగట్టడం తద్వారా వ్యాధి పెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చని అంటున్నారు .

చాలా వరకూ వ్యాధులు అధిక జ్వరంతోనే మొదలవుతాయి . తాము తయారు చేసిన పరికరం ద్వారా మనిషిలోని ఉష్ణోగ్రతను సులువుగా కనుక్కోవడం ద్వారా తగు జాగ్రత్తలు ముందుగానే తీసుకొని జాగ్రత్త పడొచ్చని ఈ కంపెనీ వారు చెబుతున్నారు . ప్రస్తుతం లభ్యమవుతున్న పరికరాలతో మనిషి యొక్క ఉష్ణోగ్రతను తెలుసుకోడానికి మరొక వ్యక్తి దగ్గరగా ఉండి పరీక్ష చేయాల్సి వస్తోంది , దీని ద్వారా పరీక్ష చేస్తున్న వ్యక్తికి కూడా వ్యాధి సోకే ప్రమాదం ఉంది . అయితే ఈ పరికరం వాడకంలో పరీక్షించాల్సినపుడు వేరొక వ్యక్తి అవసరం లేదు. ఇప్పటివరకూ ఏదైనా బాడీ స్కానింగ్ చేయాలంటే అందరూ ఒక క్రమంలో నుంచొని ఒక పరికరం ద్వారా వెళ్లాల్సి వస్తోంది . అయితే ఈ కంపెనీ వారు తయారు చేసిన పరికరాన్ని ఏదైనా గోడకు అమర్చుకోవచ్చు . ఎంతమంది గుంపులుగా ఆ ప్రదేశానికి వచ్చినా వెంటనే అందరి శరీర ఉష్ణోగ్రతలను కనిపెట్టి అధిక ఉష్ణోగ్రత కలిగిన వారిని హైలైట్ చేసి వారిని వెంటనే ఫోటో తీస్తుంది . దీని వలెనే వెంటనే ఆ వ్యక్తిని వేరు చేసి మిగతా వారికి సోకకుండా జాగ్రత్తపడొచ్చు . ఇప్పటి వరకూ మార్కెట్ లో ఉన్న పరికరాలు శరీర ఉష్ణోగ్రతలను 2 డిగ్రీల కచ్చితత్వంతో చూపుతున్నాయని , అయితే తాము తయారు చేసిన ఈ పరికరం 0.5 డిగ్రీల వేరియేషన్ తో ఉండడం వల్ల మరింత కచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉందని కంపెనీ వర్గాలు తెలుపుతున్నాయి . ఈ పరికరాన్ని ఎక్కడికైనా సులువుగా తరలించుకొని వాడుకోవచ్చని , కేవలం ఒక కంప్యూటర్ ఉంటే దానికి అనుసంధానం చేసుకొని సులువుగా ఉపయోగించుకోవచ్చని ఈ కంపెనీ వారు తెలుపుతున్నారు.

కీలక ఉపయోగాలు …

ఇన్ఫ్రారెడ్ థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ తో రూపొందిన ఈ పరికరం ద్వారా మనుషుల కదలికలో ఎటువంటి ఇబ్బంది కలిగించించకుండా వారి ఉష్ణోగ్రతలు తెలుసుకోవచ్చు .
ఈ పరికరం దానంతట అదే టెంపరేచర్ డిటెక్ట్ చేయడం వలన ఆపరేటర్ కు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం లేదు.
ఆన్లైన్ సిస్టం ద్వారా ఈ పరికరాన్ని సిస్టం కు కనెక్ట్ చేసుకొని సులువుగా వాడుకోవచ్చు .
ఈ పరికరం అత్యంత చిన్నదిగా ఉండడం వల్ల ఎక్కడికైనా అత్యంత సులువుగా తీసుకువెళ్ళొచ్చు
ఆటోమేటిక్ అలెర్ట్ సిస్టం ఉండడం వలన మనుషులలో ఉష్ణోగ్రతలు కనిపెట్టి ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటే వెంటనే తెలియజేస్తుంది .

సామాన్యంగా ప్రాణాంతక వ్యాధులు ప్రబలడంలో ఎక్కువ జనసమూహం ఉన్న ప్రదేశాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి . మరి అటువంటి జనసమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాలలలో ఈ పరికరం ఉంటే కనుక అందరికీ ఎంతో ఉపయోగకరం అని కంపెనీ వర్గాలు అంటున్నాయి . ఎయిర్ పోర్ట్స్ , రైల్వే స్టేషన్స్ , బస్సు స్టాండ్ , మాల్స్ , రెస్టారెంట్స్ , పార్క్స్ , హోటల్స్ , స్కూల్స్ , కాలేజెస్ , యూనివర్సిటీస్ , గవర్నమెంట్ బిల్డింగ్స్ మొదలగు జనసమూహం ఉంటె ప్రాంతాలలో ఈ పరికరం ఎంతగానో ఉపోయోగపడుతుందని ఈ యూకే బేస్డ్ కంపెనీ వారు తెలియజేశారు .

ప్రపంచ వైద్య శాస్త్రానికి సవాలుగా మారిన ప్రాణాంతక రోగాలు అరికట్టడంలో ఇలాంటి పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయి . “Prevention is Better than Cure ” అన్న నానుడి మనకు తెలిసినదే . మరి ఇటువంటి పరికరాల విషయంలో ప్రభుత్వాలు దృష్టి సారిస్తే రోగాలను దూరం చేయడంలో మరింత విజయం సాధించవచ్చు .

ఈ పరికరం భారత దేశంలో తమద్వారా లభ్యమవుతుందని Powern Solutions, Hyderabad కంపెనీ వారు tajavarthalu.in నిర్వహించిన ముఖాముఖిలో తెలిపారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments