కరోనా … ఈ మహమ్మారి ప్రభావం చాలా మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది . రోజు కూలీ చేసుకొని సంపాదించుకునే వారి జీవితాలను తలకిందులు చేసింది . కానీ ఈ కష్ట సమయంలో అనేకమంది సినీ , రాజకీయ ప్రముఖులు మరియు సాధారణ ప్రజలు ముందుకు వస్తున్నారు . తమలో ఉన్న దయా గుణాన్ని ఆవిష్కరిస్తున్నారు . ఇదే కోవకు చెందారు పద్మారావు నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మారావు . ఇప్పటికే కోటి రూపాయలు ఖర్చు చేసి పాకెట్స్ రెడీ చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచారు . ఒక్కో ప్యాకెట్ లో kg ₹50 విలువ చేసే 10kg రైస్, 2kg కందిపప్పు, 1kg షుగర్, 500 gr చింతపండు, 1 ఆయిల్ ప్యాకెట్ ఉంటాయి . కొంత సాయం చేసి బోలెడంత పబ్లిసిటీ కోసం ఆశపడే ఈ రోజుల్లో అంత అధికమొత్తంలో ఖర్చుపెట్టి ఎటువంటి ఆర్భాటాలకు తావివ్వకుండా తన పని తాను చేసుకుపోతున్న పద్మారావు వంటి రాజకీయ నాయకుడు అందరికీ ఆదర్శం .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments