ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న మహమ్మారి కరోనా . దీనికి ఎటువంటి విరుగుడు లేకపోవడంతో ప్రపంచం మొత్తం భయం గుప్పిట్లో ఉంది . ఒక్కరితో మొదలై ఇప్పుడు లక్షల మందికి సోకింది . చైనాలోని వ్యాహాన్ నగరంలో మొదలై ప్రపంచంలోని 200 పై చిలుకు దేశాలకు పాకిపోయింది . మృతుల సంఖ్య దాదాపు లక్షకు చేరువవుతోంది . ఈ మహమ్మారి ఈ విధంగా కొనసాగుతుండడంతో ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించి ఈ వ్యాధి ప్రబలత్వాన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో ఉన్నాయి .

మన దేశం విషయానికి వస్తే మొదట నిమ్మదిగా మొదలై ఈరోజు దాదాపు 5 వేల పై చిలుకు కేసులు నమోదయ్యాయి . ఇంకా ఎక్కడికక్కడ పెరుగుతూనే ఉన్నాయి . దీనిని నివారించే క్రమంలో భారత ప్రభుత్వం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది . అయినా కూడా కొంతమంది లాక్ డౌన్ ను విస్మరించి రోడ్లమీద యథేచ్ఛగా తిరుగుతున్నారు . ప్రభుత్వాలు అలా వచ్చిన వారి మీద కేసులు బనాయించి శిక్షిస్తున్నా కూడా జనాలు రోడ్ల మీద తిరుగుతున్నారు .

ప్రజలు గుంపులుగా తిరగక పోవడమే ఈ వ్యాధి ప్రభలత్వానికి విరుగుడు అవ్వడంతో ఈ విషయమై ప్రభుత్వం మరియు చాలా మంది కవులు , సినీ హీరోలు పాటలను రూపొందించి ప్రజల్లో మరింత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసినదే . అందరూ ఇన్ని చేస్తున్నా దాన్ని పాటించకుండా కొంతమంది ఈ నిర్ణయాలపై విమర్శలు చేస్తున్నారు . అయితే ఈ విషయమై ప్రముఖ కవి , సినీ రచయత చక్రవర్తుల మురళీకృష్ణ కూడా “క్వారెంటైనే లైఫ్ కి గ్యారంటీను , వారంటీను ” అనే పేరుతో ఒక గేయం రచించారు . ఈ గేయాన్ని డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆలపించారు .

ప్రభుత్వాలు ఎంతగా హెచ్చరిస్తున్నా రోడ్ల మీద అనవసరంగా తిరుగుతున్న జనాలను ఉద్దేశించి ఈ గేయం సాగింది . అలా వారు చేసే పనుల వల్ల ఇతరులకు , తన వాళ్లకు ఎంతమేర హాని జరిగే ప్రమాదం ఉందనేది చెబుతూ చురకలు అంటించారు . ఈ గేయాన్ని చదివిన ప్రతి ఒక్కరికి తాము రోడ్ల మీద తిరగడం ద్వారా ప్రపంచానికి ఎంతమేర నష్టం కలగచేస్తున్నామనేది చక్కగా అర్ధమవుతూ వారిలో పరివర్తన కలుగచేస్తుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments