కరోనా మహమ్మారి వల్ల ఫ్రపంచం అతలాకుతలం అవుతున్న బాధాకరమైన సమయమిది .ఈ కరోనాని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు సంసిద్ధంగా ఉండాలి..కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకత్వంలో మనం నడచి ఈకరోనాని పారద్రోలాలి…ఇది మన అందరి కనీస బాధ్యత.. ఈరోజు మన క్వారంటైనే రేపటి మన జీవితానికి గ్యారంటీను, వారంటీను..
కరోనా కలకలం…
*****
నీ కళ్ళను నీవెందుకు పొడుచుకోవడం
పక్కవారినందరినీ గ్రుడ్డిచేయడం
వొద్దొద్దని చెబుతుంటే తిరిగి రావడం
తోటివారి జీవితాలు బుగ్గిచేయడం
తల్లిదండ్రి వున్నారు..భార్యబిడ్డలున్నారు
బంధుమిత్రులున్నారు బాధపెట్టకు
ఇంటవుండు కొన్నాళ్ళు బ్రతుకుతావుచాన్నాళ్ళు
మంచిమాట ఎక్కదా మట్టిబుర్రకు
ఇంచుకైన తెలివిలేక ఇంకెందుకు జీవితం
లోకమంత శోకమైతె నీకేంటీసంతోషం
కేంద్రరాష్ట్ర నాయకులు మనకోసం చెబుతుంటే
వినపడదా కొంచమైన విమర్శలా ఆపైన
మాటల సమయం కాదిది చేతలొకటెచెయ్యాలి
కష్టకాలమొచ్చింది నిబ్బరంగ నిలవాలి
పోలీసులు డాక్టర్లు మనసువున్న సేవకులు
పారిశుద్ధ్యకార్మికులు పరమాత్ములుమనకిపుడు
చిన్నపెద్దలందరు చితికి ఆహుతౌతుంటే
ఎన్నిచెప్పి ఏంలాభం మెదడు మేలుకోకుంటే
ఆలోచనతో బ్రతుకు అందరినీ బ్రతికించు
ఆచరించి చూపించు అందరు ఆనందించు
దూరంగా వుందాము దుఃఖాన్ని ఆపుదాము
ఆశయాన్నినిలుపుదాము కరోనాని మాపుదాము
– చక్రవర్తుల మురళీకృష్ణ
© cell: +91 9030475131