ఒక పాట విజయం సాధించాలంటే అది కచ్చితంగా శ్రోతల గుండెల్లోకి చొచ్చుకు పోవాలి . ఇటువంటి పాటలు చాలా అరుదుగా వస్తుంటాయి . అద్భుతమైన సంగీతం దానికి తోడుగా చక్కనైన స్వర రచన ఉన్నప్పుడే ఇది సాధ్యం . అటువంటి పాటలలో ఇటీవల విడుదలైన “నీలి నీలి ఆకాశం” ఒకటి . ప్రదీప్ మాచిరాజు కథానాయకుడిగా పరిచయమవుతున్న “30 రోజుల్లో ప్రేమించటం ఎలా ” సినిమాలోది ఈ పాట . మున్నా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు .

చంద్రబోస్ గారు రచించిన “నీలి నీలి ఆకాశం” పాట విడుదలై ఎంతటి ప్రభంజనం సృష్హించిందో విదితమే . అద్భుతమైన సాహిత్యానికి అర్ధవంతమైన స్వర రచన జోడవ్వడంతో ఈ పాట విజయం సాధించింది . సిద్ శ్రీరామ్ , సునీత గాత్రంతో ఈ పాటను ఒక స్థాయికి తీలుకెళ్లారు . ఈ పాట వింటుంటే ప్రతీ ప్రేమికుడు తన కోసమే ఈ పాట అన్నట్టు ఉంటుంది . ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని , ప్రేమలో ఉన్నప్పుడు ఒక జంట మధ్యన ఉండే భావోద్వేగాలను చక్కగా తెలియజేశారు ఈ పాట ద్వారా తెలియజేశారు చంద్రబోస్ గారు . అయితే ఇప్పుడు ఆ పాత ఒక గొప్ప మైలురాయిని చేరుకుంది . ఇప్పటి వరకు ఈ పాటకు యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ వచ్చాయి . దీని బట్టే మనం అర్ధం చేసుకోవచ్చు ఈ పాటకు ప్రేక్షకులు ఎంతగా బ్రహ్మరధం పట్టారో . అద్భుతమైన సాహిత్యం , సంగీతానికి ఎవరైనా బానిస అవ్వవలసినదేనని మరోసారి నిరూపించింది ఈ పాట .

ప్రదీప్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమాలోని మొదటి పాటనే ప్రేక్షకులు ఇంతటి ఆదరణను అందించడం చూస్తుంటే ఆయన సినీ కెరీర్ ఎంతగొప్పగా ఉండొబోతోందో అర్ధమవుతోంది . ఈ చిత్రంలోని మరో రెండు పాటలు కూడా విడుదలై ఇదే రీతిలో సంగీత పిపాసులని ఆకట్టుకుంటున్నాయి .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments