ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందులో ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే మన తెలుగు హీరోలు నాగార్జున, చిరంజీవి,వరుణ్ తేజ్‌, సాయి ధరమ్ తేజ్‌ లు ప్రజలలో భయం పోగొట్టి కరోనా పై అవగాహన కల్పించేందుకు ఓ ప్రత్యేక గీతం రూపొదించారు. ఈ గీతం విన్న ప్రదాని నరేంద్ర మోడీ సినీ హీరోలకు తన ట్విట్టర్ ద్వారా అభినందించారు.

చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం. అని మోదీ తన ట్వీట్‌లో చక్కగా తెలుగులో రాసారు.

ప్రదాని నరేంద్ర మోడీ చేసిన ట్వీట్ పై హీరో చిరంజీవి స్పందిస్తూ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కరోనా వ్యాప్తి వల్ల మన దేశానికి ఎంతో నష్టం జరిగిందని దాన్ని తగ్గించడానికి మీరు చేస్తున్న కృషిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని చిరంజీవి అన్నారు. మీరు చేపడుతున్న భారీ యజ్ఞంలో మా వంతు మేము కృషి చేస్తామని ట్వీట్ చేసారు. సంగీత దర్శకుడు కోటి గారు, మా అందరి తరుపున మీకు నా ధన్యవాదాలు’ అంటూ చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక దేశంలో ఏ విపత్తు జరిగినా తెలుగు సీనీ రంగం ప్రజలను ఆదుకోవడానికి, వారికి అవగాహన కల్పించడానికి ముందడుగు వేస్తుంది. తమ వంతు సహాయాన్ని అందించి వారికి ఆదుకొని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ నడుం బిగించింది. ప్రజల్లో కరోనా పట్ల భయం పొగొట్టి, కరోనా పై తీసుకోలసిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరి ఇంటిలో వారు ఉంటూ పాట పాడి రికార్డ్ చేశారు. ఈ పాటను సంగీత దర్శకుడు కోటి ట్యూన్‌ చేయగా తెలుగు టాప్ హీరోలు మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జునతో పాటు యంగ్‌ హీరోలు వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ లు పాటను ఆలాపించారు.

అంతే కాక చిరంజీవి తన అభిమాలను ఈ పాటను పాడి రికార్డ్‌ ఆ వీడియోను తనకు పంపించమని నెటిజన్లను ట్వీటర్‌లో కోరారు. కరోనాను తరిమికొట్టేందుకు ‘సీసీసీ మనకోసం’ (కరోనా క్రైసిస్‌ చారిటీ మనకోసం) అనే సంస్థ ఏర్పాటు చేసి చైర్మన్‌గా చిరంజీవిని ఎన్నుకున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments