ఏపీలో 180కి చేరిన కరోనా కేసులు

541

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాత్రి 10.30 గంటల నుంచి ఇవాళ ఉదయం 10గంటల వరకు కొత్తగా 16 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 180కి చేరింది. గుంటూరు జిల్లాలో 3, కడప జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో 3, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో ఒక్కో కేసు చొప్పున కొత్తగా నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఎక్కువ మంది దిల్లీలోని జమాత్‌ వెళ్లినవారేనని అధికారులు గుర్తించారు.

కర్నూలు జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. కర్నూలు నగరంలోని రోజా వీధి, అవుకు, బనగానపల్లెలో ఒక్కొ కేసు నమోదైనట్లు వెల్లడించారు. వీరంతా దిల్లీలోని మర్కజ్‌లో జరిగిన మత ప్రార్థనలకు హాజరైన వారేని వెల్లడించారు. కర్నూలు జిల్లా నుంచి 449 మంది దిల్లీ జమాత్‌కు వెళ్లారు. ఇంకా 350 మంది రిపోర్టులు రావాల్సి ఉందని కలెక్టర్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here