కరోనా … ఈ పేరు మొత్తం ప్రపంచాన్ని స్తంభింపజేసింది . దాదాపు 195 దేశాలకు ఈ వ్యాధి విస్తరించింది . అయితే ఇప్పటికే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే . అయితే ఈ లాక్ డౌన్ పై అనేక రకాలైన వార్తలు వాట్సాప్ లో వైరల్ అవుతున్నాయి . ఈ లాక్ డౌన్ ఇంతటితో ఆగదని దీనిని ఇంకా పొడిగిస్తారని ఈ వార్తల సారాంశం . ఈ మేరకు సోమవారం కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా స్పందించారు . దేశ వ్యాప్త లాక్డౌన్ 21 రోజులేనని స్పష్టం చేశారు. లాక్డౌన్ పెంపు వార్తలు అవాస్తవం, నిరాధారమన్నారు.
Alert : There are rumours & media reports, claiming that the Government will extend the #Lockdown21 when it expires. The Cabinet Secretary has denied these reports, and stated that they are baseless#PIBFactCheck#lockdownindia #coronaupdatesindia #IndiaFightsCorona
— PIB India 🇮🇳 #StayHome #StaySafe (@PIB_India) March 30, 2020