‘‘కమల్‌ హాసన్‌ క్వారంటైన్‌లో ఉన్నారు’’ అనే వార్తలు శనివారం తమిళనాడులో హల్‌ చల్‌  చేశాయి. దానికి కారణం కమల్‌ హాసన్‌ నివాసం వద్ద ‘గృహ నిర్భందంలో ఉన్నారు’ అనే స్టికర్‌ కనిపించడమే. అయితే ‘ఆ ఇంట్లో నేను ఉండటం లేదు. ప్రస్తుతం మా పార్టీ కార్యక్రమాలను నిర్వహించడానికి ఉపయోగిస్తున్నాం. నేను గృహ నిర్భందంలో లేను. కానీ సామాజిక దూరం పాటిస్తున్నాను’’ అని అధికారిక ప్రకటన విడుదల చేసి అభిమానుల అనుమానాలను క్లియర్‌ చేశారు కమల్‌.

అయితే  ‘గృహ నిర్భందంలో ఉన్నారు’’ అనే  స్టికర్‌ అంటించడానికి కారణం వేరే ఉందట. కమల్‌ హాసన్‌ తో కొన్నేళ్లు సహజీవనం చేసిన గౌతమి ఈ నెల మొదటివారంలో దుబాయ్‌ నుంచి తిరిగి వచ్చారట. ఆమె పాస్‌పోర్టులో కమల్‌ పాత నివాస గృహానికి సంబంధించిన అడ్రెస్‌ ఉండటంతో ప్రభుత్వ ప్రతినిధులు ఆ ఇంటికి స్టికర్‌ అంటించారట. అసలు విషయం అది. ఇక గౌతమి తన గురించి మాట్లాడుతూ –‘‘నేను బాగానే ఉన్నాను. దుబాయ్‌ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాను. మీరందరు కూడా ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం చెప్పిన సూచనలను పాటిద్దాం’’ అని ట్వీటర్‌ ద్వారా పేర్కొన్నారు గౌతమి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments