కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా “ఆచార్య” సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసినదే . ఈ చిత్రం గురుంచి అభిమానుల్లో అంచనాలు రొజురోజుకీ పెరిగిపోతున్నాయి . ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసినదే . అయితే ఈ చిత్రంలో మరొక కీలక పాత్రలో ఏ కథానాయకుడు నటిస్తున్నారనేది ఇంతవరకూ తెలియలేదు . అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ పై కొన్ని వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి . అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ శ్రీరామనవమికి రిలీజ్ చేయాలని చిత్ర బృందం ఆలోచన చేస్తున్నారట . అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది మనం వేచి చూడాల్సిందే .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments