కరోనాపై యుద్దానికి ప్రతీ ఒక్కరు తమ మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ పెద్ద తమ వంతు సాయం అంధించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్రా ప్రభుత్వాలకు కలిపి 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించాడు. బాబాయ్ బాటలో అబ్బాయి కూడా 70 లక్షల రూపాయలం సాయం ప్రకటించాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు.
కరోనా ప్రభావంతో షూటింగ్ లు ఆగిపోవటంతో సినీ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారి కోసం కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టుగా ప్రకటించాడు మెగాస్టార్. `ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ పరిస్థితులు, కరోనా మహమ్మారి ప్రభలకుండా ఉండేందుకు అనివార్యం.
ఉగాది సందర్భంగా నిన్న సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి, అప్పటి నుంచి ట్విటర్ యాక్టివ్గా ఉంటున్నాడు. తనను ఈ ప్లాట్ ఫాంలోకి ఆహ్వానించిన ప్రతీ ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతూ, అదే సమయంలో కరోనా పై సూచనలు చేస్తున్నాడు. ఇక సినిమాల విషయానికి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు చిరంజీవి. కరోనా ప్రభావం కారణంగా ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది.