కరోనాపై యుద్ధానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న ప్రయత్నాలకు పలువురు ప్రముఖులు తమ వంతు సాయం అందిస్తున్నారు. సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ మేరకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ అధినేత పీవీ కృష్ణారెడ్డి రూ.5 కోట్ల చెక్కును సీఎం కేసీఆర్కు అందజేశారు. అలాగే, శాంతా బయోటెక్ సంస్థ అధినేత వరప్రసాద్ రెడ్డి వ్యక్తిగత సాయంగా రూ. కోటి చెక్కు సీఎంగా అందించగా.. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత నర్సింహారెడ్డి, మీనాక్షి గ్రూప్ ఛైర్మన్ కె.ఎస్.రావు, క్రెడాయ్ ప్రతినిధులు రూ.కోటి చొప్పున చెక్కులను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు అందజేశారు. మరోవైపు లారస్ ల్యాబ్స్ సంస్థ ముందుకు వచ్చి లక్ష హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను ఉచితంగా అందజేయడంతో పాటు సీఎం సహాయ నిధికి ఆ సంస్థ సీఈవో సత్యనారాయణ రూ. 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ విపత్కర సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది కోసం జీపీకే సంస్థ ప్రతినిధులు ఫణికుమార్, శైలజా రెడ్డి 4 వేల ఎన్-95 మాస్కులను కేటీఆర్కు అందించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని భారీగా విరాళాలు ఇచ్చిన దాతలకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ
Subscribe
Login
0 Comments