‘బిగ్‌బాస్’, ‘మెగాస్టార్’ చిరంజీవి శార్వరి నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ట్విటర్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. @KChiruTweets అనే అధికారిక ట్విటర్ ఖాతా వేదికగా ఆయన పలు ట్వీట్లు కూడా చేశారు. చిరు ట్విటర్‌లోకి వచ్చిన అయిన సందర్భంగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్‌మీడియా వేదికగా ఆయనకు స్వాగతం చెప్పారు. దీంతో చిరు తాజాగా తనకి ట్విటర్‌లోకి వెల్కమ్ చెప్పిన వారందరికీ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు.
నాగార్జున: వెల్కమ్ టు ట్విటర్ చిరు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీ మాటలు మమ్మల్ని ఎంతో గైడ్ చేస్తున్నాయి.
చిరు: థ్యాంక్యూ మై డియర్ బ్రదర్ నాగ్
మహేశ్: వెల్ టు ట్విటర్ సర్!
చిరు: థ్యాంక్యూ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. కరోనాను కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ఆరు విలువైన నియమాల గురించి నువ్వు చాలా చక్కగా వివరించావు. ప్రతి ఒక్కరూ దానిని పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
నితిన్: వెల్కమ్ టు ట్విటర్ బిగ్‌బాస్
చిరు: ధన్యవాదాలు నితిన్. రెండు తెలుగు రాష్ట్రాలకు నువ్వు చేసిన సాయం ప్రశంసనీయం. మొత్తం సినీ పరిశ్రమ కలిసి ఒక కూటమిగా మారి మన వంతు సాయం అందించాల్సిన సమయమిది.
ఎన్టీఆర్: ‘ఆర్ఆర్ఆర్’ మోషన్ పోస్టర్‌పై ప్రశంసలు కురిపించినందుకు ధన్యవాదాలు. మీ మాటలు మాకెంతో విలువైనవి. ట్విటర్ ప్రపంచంలోకి స్వాగతం.
చిరు: థ్యాంక్యూ మై డియర్ తారక్. కరోనా వైరస్ అవగాహనపై నువ్వు చరణ్ కలిసి చేసిన వీడియో చాలా సమర్థవంతమైనది. సమయానుకూలంగా మీరు స్పందించినందుకు ప్రశంసిస్తున్నాను.
కొరటాల శివ: ట్విటర్‌లోకి స్వాగతం. మీరు మమ్మల్ని మరింత గైడ్ చేయాలని ఆశిస్తున్నాను.
చిరు: థ్యాంక్యూ శివ గారు. ఈ 21 రోజుల లాక్‌డౌన్‌ను సముచితంగా ఉపయోగించుకునేలా మీ నుంచి ఏమైనా సృజనాత్మక సూచనలు ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను.
శ్రీకాంత్: ట్విటర్‌లోకి వెల్కమ్ అన్నయ్య!
చిరు: థ్యాంక్యూ శ్రీకాంత్
పూరి జగన్నాథ్: వెల్కమ్ టు సోషల్‌మీడియా సర్. సామాజిక దూరం పాటిస్తున్న సమయంలో సోషల్‌మీడియా అనేది మమ్మల్ని మీకు మరింత దగ్గర చేస్తుంది.
చిరు: థ్యాంక్యూ పూరీ. సామాజిక దూరం అనేది కుటుంబంతో గడిపేందుకు ఎంతో విలువైన సమయాన్ని అందిస్తుంది. ముంబయి, బ్యాంకాక్‌లోని బీచ్‌లను నువ్వు మిస్ అవుతూ ఉండవచ్చు. కానీ నువ్వు ఇంట్లో సమయాన్ని గడపడం చూసి పవిత్ర, ఆకాశ్ ఎంతో సంతోషిస్తారని నేను కచ్చితంగా చెప్పగలను.
ఖుష్బూ: డియర్ సర్. మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రేమతో ఈ పిచ్చి ప్రపంచంలోకి స్వాగతం.
చిరు: ధన్యవాదాలు ఖుష్బూ. ఇలాంటి విభిన్న పరిస్థితుల్లో ప్రజలతో మరింత మమేకం అయ్యేందుకు ఈ పిచ్చి ప్రపంచం ఓ సమర్థవంతమైన పద్ధతిని అందిస్తుందని ఆశిస్తున్నాను
గంటా శ్రీనివాస్: వెల్కమ్ అన్నయ్య
చిరు: థ్యాంక్యూ బ్రదర్ గంటా శ్రీనివాస్. 21రోజులలాక్డౌన్ను వైజాగ్ ఎలా ఎదుర్కొంటుంది. ఇళ్లకే పరిమితం అవ్వాలనే మెస్సేజ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నువ్వు ఎంతగానో కష్టపడుతున్నావని ఆశిస్తున్నాను.
అల్లు అర్జున్: మెగాస్టార్గారికి ట్విటర్‌లోకి హృదయపూర్వక స్వాగతం. ఈ సమయం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం.