• రాజోలు: గజల్ చారిటబుల్ ట్రస్ట్, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ విగ్రహాష్కరణ, వారి జన్మస్థలం శంకరగుప్తం గ్రామం, తూర్పుగోదావరి జిల్లాలో ది.5 మార్చి 2020 ఉదయం 9.42 ని.లకు శ్రీ కోనరఘుపతి,ఉప శాసన సభాధిపతి వారి చేతుల మీదుగా జరుగనున్నదని, శ్రీ మల్లాది విష్ణు, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్, గౌరవ అతిథిగా, విశిష్ట అతిథిలుగా శ్రీమతి చింతా అనురాధ, ఎంపీ, శ్రీ రాపాక వరప్రసాద్ , శాసన సభ్యులు , పూర్వమంత్రి శ్రీ గొల్లపల్లి సూర్యారావు, శ్రీమతి పెదపాటి అమ్మాజీ, శ్రీ మురళిధర్ రెడ్డి, కలెక్టర్ విచ్చేస్తున్నట్లు కార్యక్రమ సంచాలకులు డా.గజల్ శ్రీనివాస్, శ్రీ రాయప్రోలు భగవాన్, కమిటీ అధ్యక్షులు ఆచంట వీర వెంకట సత్యనారాయణ లు, శ్రీ శ్రీధర్ అప్పసాని, నాట్స్ చైర్మన్, శ్రీ శ్రీనివాస్ మంచికలపూడి, ప్రెసిడెంట్ నాట్స్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ విద్వాంసులు, కళాకారులు శ్రీ డి.వి. మోహన్ కృష్ణ, శ్రీ మోదుమూడి సుధాకర్, శ్రీ వేమూరి విశ్వనాథ్, శ్రీ కృష్ణకుమార్, శ్రీ స్వాతీ సోమనాథ్, కళా పోషకులు శ్రీ ఉద్ధరాజు కాశీ విశ్వనాధరాజు లకు “డా, మంగళంపల్లి బాల మురళీకృష్ణ కళా పురస్కారాన్ని”అందజేయు నున్నట్టు , అలాగే డా. బాలమురళి గారి శిష్యుల చే సంగీత నీరాజన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనదని శ్రీ గజల్ శ్రీనివాస్ తెలిపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments