ప్రేమ … ఈ పదానికి ఒక కొలమానం లేదు . ఏ బంధం ముడిపడాలన్నా , బలపడాలన్నా దానికి ప్రేమే కారణం . జీవితంలో అనేక రకాలైన సమస్యలు ఎదురవుతాయి , అయితే ఆ సందర్భాల్లో బంధాలు దెబ్బతినకుండా ఎలా మసులుకుంటామనేది ముఖ్యం . ఇదే లైన్లో ఇటీవల విడుదలై అందరి మన్ననలను అందుకుంటున్న లఘు చిత్రం “నిధి” . UMMAR MITAI దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లఘు చిత్రానికి అర్జున్ నల్లగొప్పుల సంగీతం అందించారు . ఈ చిత్రానికి చక్రవర్తుల మురళీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు .

తమకు సంతానం కలగరని తెలుసుకొని అర్ధం లేని ఆలోచనలతో విడాకులు తీసుకోవడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం . అయితే అలాంటి సందర్భాలలో ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని చాలా చక్కగా చూపించారు . ప్రేమ ముందు ఎటువంటి సమస్యలు ఎదురైనా వాటిని జయించవచ్చు అనే విషయాన్ని అందరికీ అర్ధమయ్యే విధంగా తెలియజేసారు . ఈ షార్ట్ ఫిలిం లో కూడా ఒక జంట మధ్య ఇలాంటి సంఘటనే ఏర్పడుతుంది . అయితే ఆ జంట ఏ విధంగా ఆలోచించారు , అనుకోని వ్యక్తి ఎదురై ఆ సందర్భాన్ని ఎలా మలిచాడు అనేది ఇందులోని కధ . తక్కువ నిడివిలో సున్నితమైన విషయాన్ని తీసుకొని చాలా చక్కగా ఆవిష్కరించారు ఈ షార్ట్ ఫిలిం టీం . ఇంత మంచి లఘు చిత్రాన్ని అందించిన UMMAR MITAI ద్వారా భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆశిద్దాం .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments