నోరు తిరగక ఇబ్బందిపడిన ట్రంప్!

0
124

అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ పాల్గొన్న ‘నమస్తే ట్రంప్’   సభకు దాదాపు 1.25 లక్షల మంది హాజరయ్యారని అంచనా! అయితే, ఈ సభకు విచ్చేసిన లక్షలాది మందిని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్ భారతీయతను ప్రతిబింబించేందుకు తాపత్రయపడడం కనిపించింది. అయితే ఈ ప్రయత్నంలో ఆయన అనేకమార్లు తడబడ్డారు. భారతీయ పదాలు పలకలేక, నోరు తిరగక ఇబ్బందిపడ్డారు.

మోదీని ఉద్దేశించి ‘చాయ్ వాలా’ అనే ప్రయత్నంలో ‘చైవాలా’ అని, వేదాలను ‘ద వేదాస్’ అనబోయి ‘ద వేస్తాస్’ అని, స్వామి వివేకానందను ‘వివేకానన్’ అని పలికారు. సచిన్ టెండూల్కర్ ను ‘సుచిన్’ అని, కోహ్లీని ‘ కోలీ’ అని సంబోధించారు. అయితేనేం, తనదైన పద్ధతిలో తమాయించుకుని ప్రసంగం కొనసాగించి జనసంద్రంలా మారిన మొతేరా స్టేడియాన్ని హోరెత్తించారు. ట్రంప్ ప్రసంగం ఆద్యంతం సభికులు హర్షధ్వానాలతో నీరాజనాలు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here