ఛలో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి గీత గోవిందంతో తానేంటో నిరూపించుకున్న కన్నడ కుట్టి రష్మిక మందన్న . సరిలేరు నీకెవ్వరూ , భీష్మ సినిమాలతో తెలుగు సినీ అభిమానులకు మరింత దగ్గరై మరిన్ని మంచి అవకాశాలు దక్కించుకుంది ఈ భామ . ఇటీవల ఆమె ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు . ఆమె మాట్లాడుతూ తనను అందరూ తెలుగు అమ్మాయిగానే భావిస్తున్నారని , అచ్చు తెలుగు అమ్మాయిలాగానే ఉండటమే కాక తెలుగు కూడా చాలా బాగా మాట్లాడుతున్నానని , భీష్మ సినిమాలో డబ్బింగ్‌ కూడా తానే చెప్పుకున్నానని , ఇంకో రెండు మూడు సినిమాల తరువాత హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉండాలనిపిస్తుందని అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments