పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తరువాత సుదీర్ఘ విరామం తరువాత మళ్ళీ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసినదే . ఆయన ఇక మీద సినిమాలలో నటించబోనని పలు మార్లు స్పష్టం చేసినా ఆర్ధిక కారణాల దృష్ట్యా మళ్ళీ మేకప్ వేసుకున్నారు . హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమా రీమేక్ లో పవన్ నటిస్తున్నారు . ఈ చిత్రాన్ని దిల్ రాజు , బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు . పవన్ ఈ సినిమాపై స్పందించకపోయినా ఇప్పటికే ఈ సినిమాలో పవన్ లుక్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ కు సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి .

అయితే ఈ చిత్రానికి “లాయర్ సాబ్” టైటిల్ ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది . అయితే ఈ చిత్రానికి టైటిల్ “లాయర్ సాబ్” కాదని “వకీల్ సాబ్” అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు సమాచారం . ఈ చిత్రంలో హీరోయిన్లు గా నివేదా థామస్, అంజలి, అనన్యను తీసుకున్నట్టు సమాచారం . ఉగాది కానుకగా మార్చి 25న ఈ సినిమా టైటిల్ లోగోను, మే 15న సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments