దేశ భద్రత విషయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించే సైనికులను కలవడం చాలా సంతోషంగా ఉందని సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా సైనికులను మహేశ్ బాబు, విజయశాంతి కలిశారు. ఇందుకోసం మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర యూనిట్‌తో కలిసి హైదరాబాద్ సీఐఎస్ఎఫ్ అకాడమీకి వెళ్లారు. అక్కడ జవాన్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ తన జీవితంలో ఈ రోజును ఎప్పటికి మర్చిపోలేనని చెప్పారు. దేశ ప్రజల్ని కాపాడుతున్న సైనికులకు ఈ సందర్భంగా మహేశ్ బాబు సెల్యూట్ చెప్పారు.
కాగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేశ్ బాబు ఆర్మీ ఆఫీసర్‌గా, విజయశాంతి ప్రొఫెసర్‌గా కనిపించారు. దేశ భద్రత కోసం ఆర్మీ ప్రదర్శించే ధైర్యసాహసాలను చూసి ప్రతిఒక్కరూ గర్వించేలా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీంతో ఈ సినిమాకు భారీ స్పందన లభించింది. సంకాంత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.