గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘భారతమాతకు మహా హారతి’ కార్యక్రమం మరి కాసేపట్లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో జరగనుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధర్యంలో జరగబోయే ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళి సై తో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. 3వేల మందికి పైగా విద్యార్థులు భారత మాత వేషధారణలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని బీజేపీ నాయకులు తెలిపారు. ఇప్పటికే ప్రజలు భారీ సంఖ్యలో హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌కి చేరుకున్నారు. కార్యక్రమానికి స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments