దేశవ్యాప్తంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇండియా గేట్ సమీపంలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి దేశ ప్రజల తరఫున శ్రద్ధాంజలి ఘటించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవనే, నావికాదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, వాయిసేనాధిపతి ఎయిర్ మార్షల్ ఆర్‌కేఎస్ బదూరియా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అనతరం రాజ్‌పథ్ వద్ద రిపబ్లిక్ డే వేడుకలకు మోడీ బయలుదేరి వెళ్లారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments