కొన్ని విషయాలు చూసినప్పుడు అరె మనకి ఇంత మంచి ఆలోచన ఎందుకు రాలేదు అనిపిస్తుంది . అలాంటివాటిలో పాత రైలు బోగీలను చిన్న చిన్న కాలువలపై వంతెనలుగా వాడడం . సామాన్యంగా పంట కాలువలపై చిన్న చిన్న నదీ పాయలపై వంతెనలను చూస్తుంటాం . అయితే వాటికి బాగానే ఖర్చు అవుతుంది . అయితే వాటికి బదులుగా పాత బడిన బోగీలను తీసుకు వచ్చి కొంత మేర మరమత్తులు చేసి ఆ కాలువలపై వారధిలా వాడుకోవచ్చు . ఈ విధానం ఆచరించ గలిగితే చాలా వరకు వారధి నిర్మాణ ఖర్చులు తగ్గుతాయి . అయితే ఈ విధానం ద్వారా పాదచారులు , ద్విచక్ర వాహనదారులు ఎక్కువ స్థాయిలో లబ్ది పొందుతారు . పాత బడిన బోగీలను వృధా చేయకుండా ఈ విధంగా వినియోగించుకోగలితే రవాణాకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments