ప్రతిష్టాత్మక సంస్థ ” షహీద్ మేళా బేవర్ -ఉత్తర ప్రదేశ్ ” అధ్యక్షుడిగా ప్రఖ్యాత గ్గాయకులు డా .గజల్ శ్రీనివాస్ ను మేళా కమిటి ఏకగ్రీవం గా ఎన్నుకున్నట్టు సంస్థ సంచాలకులు శ్రీ రాజ్ త్రిపాఠి పత్రికా ప్రకటనలో తెలియజేసారు . షహీద్ మేళా ప్రతి ఏటా జనవరి 23 నుండి ఫిబ్రవరి 10 వ తేదీ వరకు జరుగుతుందని, స్వాతంత్ర సంగ్రామంలో అసువులు బాసిన త్యాగధనులకు లక్షలాది మంది ఈ ఉత్సవం లో నీరాజనం పలుకుతారని తెలిపారు. దేశవ్యాప్తం గా ఎంతో మంది ఈ ఉత్సవం లో సాంస్కృతిక కార్యక్రమాలు , చిత్ర ప్రదర్శన , కవి సమ్మేళనం లో పాల్గొని దేశభక్తి ని చాటి చెబుతారని తెలిపారు.

1942 లో కృష్ణ కుమార్ , 14 ఏళ్ళ విద్యార్థీ, శ్రీ సీత రామ్ , శ్రీ జమునా ప్రసాద్ త్రిపాఠి లు బ్రిటిష్ వారి తుపాకీ గుళ్లకు ఎదురువెళ్లి స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. ఆ పిదప లక్షలాది మంది స్పూర్తి పొంది బేవర్ లో ఉద్యమాన్ని ఉదృతం చేసారు . ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసారు. వారి గురుతుగా 1972 నుండి షహీద్ మేళా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్టు , దేశం లో మరెక్కడా లేనట్టుగా 26 మంది స్వాతంత్ర సమర యోధులకు “షహీద్ మందిరాన్ని ” నిర్మించినట్టు శ్రీ రాజ్ త్రిపాఠి తెలిపారు. డా. గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో భవిష్యత్తులో అన్ని రాష్ట్రల్లో షహీద్ మేళ నిర్వహించి ఈ తరం ప్రజలకు స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను గురుతుచేస్తామని అన్నారు. త్వరలో తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ లో నిర్వహిస్తామని తెలిపారు

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments