కొన్నాళ్లుగా ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో ద్వారా మంచి పేరు సంపాదించిన సుడిగాలి సుధీర్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అనే చెప్పాలి. మొదట ఒక మెజీషియన్ గా తన లైఫ్ ప్రారంభించిన సుధీర్, ఆ తరువాత కొద్దిరోజులకు తన స్నేహితుడి ద్వారా ఈటివిలో ఛాన్స్ సంపాదించానని, అదే సమయంలో ప్రసారం కానున్న జబర్దస్త్ షోలోని మేనేజ్మెంట్ లో ఒక సభ్యుడిగా తనకు అవకాశం దొరికిందని పలు ఇంటర్వ్యూ ల్లో సుధీర్ చెప్పడం జరిగింది. ఆ తరువాత తన టాలెంట్ చూసిన షో నిర్వాహక సభ్యుల్లోని కొందరు, తనకు షోలో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించారని అన్నారు. ఆ తరువాత మెల్లగా తన టాలెంట్ తో దినదినాభివృద్ధి చెందిన సుధీర్, కొన్నాళ్ళకు ఆ షోలో ఏకంగా తన పేరుతో ఒక టీమ్ ని ఏర్పాటుచేసుకోవడం జరిగింది.

ఇక ప్రస్తుతం ఆ షోలో మంచి పేరుతో దూసుకెళ్తున్న వారిలో సుధీర్ కూడా ఒకరు. ఇక అదే జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా మంచి పేరు సంపాదించిన రష్మీ, అంతకముందుకు కొన్ని షోల్లో పాల్గొన్నప్పటికీ కూడా అవేవి ఆమెకు పెద్దగా గుర్తింపుని తీసుకురాలేదు. అయితే ఆ షోలో ఒకానొక సందర్భంలో సుధీర్, రష్మీ ఇద్దరూ కలిసి నటించి, అందులోని ఒక సీన్లో పెళ్లి చేసుకుంటారు. ఇక అప్పటి నుండి వారిద్దరి మధ్య ప్రేమ ఉందని, త్వరలో వారు పెళ్లి చేసుకుంటారని వార్తలు ప్రచారం అవడం మొదలయ్యాయి. ఆ వార్తలపై ఇప్పటికే పలు మార్లు సుధీర్, రష్మీ పూర్తిగా ఖండించినప్పటికీ కూడా అవి ఆగలేదు. ఇక ప్రస్తుతం ప్రసారం అవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ షో లేటెస్ట్ ఎపిసోడ్ మొన్న శుక్రవారం జరిగింది. ఆ ఎపిసోడ్ లో రష్మీ క్యారెక్టర్‌లో నటి విద్యుల్లేక రామన్ మొదట ఎంట్రీ ఇచ్చి, అక్కడినుండి కాసేపు సుధీర్ కేరెక్టర్‌లో ఉన్న బాబును ఓ ఆటాడుకోవడం అక్కడి వారిని ఫుల్ గా కడుపుబ్బా నవ్వించింది.

అనంతరం కాసేపటికి రష్మీ, సుధీర్ ఇద్దరూ కూడా షోలోకి ఎంట్రీ ఇస్తారు. ఆ సమయంలో సుధీర్‌ను బెల్ట్‌తో కొట్టాలని రష్మీని అడగడంతో సరేనంటూ ఆమె బెల్ట్ తీసుకుంటుంది. దానికి రియాక్ట్ అయిన సుధీర్, నా శరీరాన్ని గాయపర్చు కానీ, నా మనసును మాత్రం గాయపర్చకు అంటూ డైలాగ్ వేయగానే రష్మీ ఒక్కసారిగా అతడిని చూడడంతో, వెంటనే ఆమె కళ్లలోకి కళ్లు పెట్టి సుధీర్ కూడా చూస్తూ ఉండిపోతాడు. ఆ వెంటనే రోజా మాట్లాడుతూ, అలా చూస్తూ ఉంటావేం, సుధీర్‌ను కొట్టూ అని అడుగగా, సరదాగా రష్మీ, సుధీర్ ని అంటీముట్టనట్లు బెల్టుతో కొడుతుంది. ఆ సీన్ తో మరొక్కసారి రోజా అందుకుని, అబ్బో అబ్బో ,సుధీర్ మీద ఎంత ప్రేమలేకపోతే రష్మీ అతడిని అంత సున్నితంగా కొడుతుంది చెప్పండి అని అనగానే, షోలోని వారందరూ కూడా ఒక్కసారిగా ఈలలు, గోలలతో హోరెత్తిస్తారు. కొంత గ్యాప్ తర్వాత రష్మీ, సుధీర్ మంచి రొమాంటిక్ మూడ్ లోకి వచ్చి, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో సందడి చేయడంతో ప్రేక్షకులు కూడా ఆ షోకి బాగా కనెక్ట్ అయ్యారు అనే చెప్పాలి. ఇక ఈ సీన్ తరువాత నిజంగా వారిద్దరికీ మధ్య ప్రేమ ఉందంటూ మరింత ఎక్కువగా ప్రచారాలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి…..!!

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments