జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం షురూ

573

వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అరవింద సమేత వీరరాఘవ అనే సినిమా వచ్చింది. కలెక్షన్ల వర్షం కురిపించకపోయినా, మంచి సినిమా అనే పేరు తెచ్చుకుంది. ఇకపై ఇలాంటి ప్రయోగాల జోలికి పోకుండా, తన మార్క్ సినిమాతోనే ఎన్టీఆర్ ను ప్రజెంట్ చేయాలని నిర్ణయించుకున్నాడు త్రివిక్రమ్. ఈ మేరకు తారక్-త్రివిక్రమ్ మధ్య చర్చలు పూర్తయ్యాయి. స్క్రిప్ట్ కూడా ఆల్ మోస్ట్ కొలిక్కి వచ్చేసింది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాను జనవరిలో లాంఛ్ చేయాలని భావిస్తున్నారు. అప్పటికి ఆర్-ఆర్-ఆర్ షూటింగ్ కూడా దాదాపు పూర్తయిపోతుంది. అల వైకుంఠపురములో సినిమాను పూర్తిచేసిన త్రివిక్రమ్, ఎలాగూ అప్పటికి ఫ్రీ అయిపోతాడు. సో.. జనవరిలో ఈ సినిమాను లాంఛ్ చేస్తే, ప్రీ-ప్రొడక్షన్ పనుల్ని ప్రారంభించుకోవచ్చనేది త్రివిక్రమ్ ఆలోచన. ఎన్టీఆర్ కూడా దీనికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

సో.. ఈసారి ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో పక్కా కామెడీ-లవ్ ఎంటర్ టైనర్ రాబోతోందనేది గ్యారెంటీ. ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ ను ఈమధ్య మిస్సయ్యారు ప్రేక్షకులు. అప్పుడెప్పుడో వచ్చిన అదుర్స్ తర్వాత మళ్లీ ఫుల్ లెంగ్త్ కామెడీ చేయలేదు ఎన్టీఆర్. త్రివిక్రమ్ సినిమాతో ఆ లోటు తీరుతుందని భావిస్తున్నారు.

అన్నట్టు ఇవన్నీ ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. అల వైకుంఠపురములో రిజల్ట్ మీద ఈ కాంబినేషన్లు, కథలన్నీ ఆధారపడి ఉంటాయి. అది హిట్ అయితే, ఇప్పటివరకు అనుకున్న ప్లాన్ తోనే ముందుకెళ్తారు. బన్నీ సినిమా ఫ్లాప్ అయితే మళ్లీ సమీకరణాలు మారిపోతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here