కథానాయకుడు ఆది సాయికుమార్ పుట్టినరోజు (సోమవారం) సందర్భంగా ఆయన హీరోగా రూపొందుతున్న రెండు కొత్త చిత్రాలను ప్రకటించారు. ఆది హీరోగా ‘శశి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరికొత్త లుక్‌లో కనపడుతున్నారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి.వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చేతిలో మైక్‌తో కోపంగా ఉన్న ఆది ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. సురభి, రాశీసింగ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అరుణ్ చిలువేరు సంగీతాన్ని, అమర్నాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఒక షెడ్యూల్ చిత్రీకరణ మాత్రమే మిగిలిన ఉన్న ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను 2020 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు’ అని చిత్ర బృందం తెలిపింది.
జి.బి.కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్ చిత్రం
ఆది సాయికుమార్ హీరోగా జి.బి.కృష్ణ దర్శకత్వంలో మహంకాళి మూవీస్ పతాకంపై మహంకాళి దివాకర్ నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కనుంది. దీని గురించి నిర్మాత మహంకాళి దివాకర్ మాట్లాడుతూ, ‘హిట్ కొట్టాలని కసిమీద ఉన్న ఆదికి సరైన కథ దొరికింది. పూరీ జగన్నాధ్ దగ్గర పని చేసిన జి.బి.కృష్ణ ఈ సినిమాకు కథ ఇచ్చారు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానుంది. ఆది చేసిన పాత్ర గత సినిమాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుంది. జనవరిలో స్టార్ట్ చేసి సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసి సమ్మర్లో విడుదలకి ప్లాన్ చేస్తున్నాం. కథ నచ్చడంతో ఎక్కడా రాజీ పడకుండా క్వాలిటీగా నిర్మించనన్నాం. చిత్రంలో నటించబోయే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని చెప్పారు.