ఆది పుట్టినరోజు సందర్భంగా తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు..
మహంకాళి మూవీస్ పతాకం పై మహంకాళి దివాకర్ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.. హిట్ కొట్టాలని కసి మీద ఉన్న ఆదికి సరైన కథ కుదిరినట్లు సమాచారం ..పూరి దగ్గర పనిచేసిన జి బి కృష్ణ కథ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఈయన చెప్పిన కథ కి ఆది కనెక్ట్ అవ్వడంతో సినిమా చేయడానికి ఉత్సహంతో ఉన్నట్లు తెలిపారు.సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరిలో స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు… కెరియర్ లో గత చిత్రాలకి బిన్నంగా ఈ చిత్రం లో ఆది క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలిపారు.. అతి వేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరి లో షూటింగ్ మొదలుపెట్టి సింగల్ షెడ్యూల్ లో పూర్తి చేసి సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ చిత్ర బృందం.కధ బాగా నచ్చడంతో క్వాలిటీ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హై ప్రోడుక్షన్ విలువలతో సినిమాని నిర్మిస్తున్నట్లు నిర్మాత మహంకాళి దివాకర్ తెలిపారు.. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు కాస్ట్ క్రూ వివరాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడించునున్నారు.ఈ చిత్రానికి నిర్మాత మహంకాళి దివాకర్ , రచన – దర్శకత్వం : జి బి కృష్ణ

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments