అనిల్ రావిపూడి దర్శకత్వం సూపర్ స్టార్ మహేష్ బాబు వహించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జనవరి 5న హైదరాబాద్ ఎల్భీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించబోతున్నాడు.ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ సరిలేరు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది.
ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకి జోడిగా రష్మిక మందన నటిస్తున్నారు. విజయశాాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, బండ్ల గణేష్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, హరితేజ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.