జయం మూవీ ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నితిన్ ఇప్పటికే పలు సినిమాలు చేయగా, ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్ లో గల బ్యాచిలర్ హీరోల్లో నితిన్ ఒకడు. గతంలో నితిన్ ఓ అమ్మాయిని ప్రేమించాడని, డేటింగ్ లో ఉన్నాడని వార్తలొచ్చాయి. అయితే ఆతర్వాత ఇలాంటి వార్తలు తగ్గడమే కాకుండా కెరీర్ మీద నితిన్ దృష్టి పెట్టాడు. వెంకీ కుడుముల డైరెక్షన్ లో భీష్మ సినిమా చేస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్ గా చేస్తోంది. ఈసినిమా టీజర్ విడుదలై ఆడియన్స్ ని అలరించింది.

అలాగే కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తున్న రంధి సినిమాలో నితిన్ హీరోగా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి డైరెక్టర్ గా ఉన్నాడు. కాగా చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో చదరంగం మూవీ సెట్స్ మీదికి వెళ్ళాలి. మొత్తం మూడు సినిమాలతో నితిన్ బిజీగానే ఉన్నాడు. అయితే అసలు సినిమా జీవితంతో సంబంధం లేని సాంప్రదాయ రెడ్డి కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్నాడట. యితడు యాక్టర్ అయితే ఆమె డాక్టర్ అట. ఎక్కువమంది కాకుండా కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వచ్చేలా ఈ పెళ్ళికి ప్లాన్ చేశారట. ఎందుకంటే పెళ్లి జరిగేది దుబాయిలో నట.

నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఎలాంటి హడావిడి లేకుండా పెళ్లి కేవలం కుటుంబ వ్యవహారంగానే ఉండాలని భావిస్తున్నారట. అయితే మ్యారేజ్ రిస్పెషన్ మాత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా పెట్టడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారట.పెళ్లికూతురు ఎవరో గోప్యంగా ఉంచారు. కాకపొతే వచ్చే ఏప్రియల్ 15న పెళ్లి డేట్ ఫిక్స్ చేసినట్లు ఫిలిం నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. 2020లో కొత్త సినిమాలతో రావడమే కాదు పెళ్లితో కూడా కొత్తజీవితం ప్రారంభించ బోతున్నట్లు టాక్.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments