యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఇలా పాత్ర ఏదైనా తనదైన శైలిలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు విక్టరీ వెంకటేష్. కలిసుందాం రా, ప్రేమించుకుందాం రా, నువ్వు నాకు నచ్చావ్‌, పవిత్ర బంధం, గణేష్‌, లక్ష్మీ, తులసి వంటి చిత్రాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. నేడు వెంకటేష్ 59వ బర్త్‌డే. ఈ సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు ఆయనకి శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. వెంకటేష్‌కి టాలీవుడ్ సినీ లోకం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు మేనల్లుడు చైతన్యతో కలిసి నటించిన “వెంకీ మామ” చిత్రం విడుదల.. ఈ ప్రత్యేక సందర్భంలో సీనియర్ హీరో వెంకటేష్ తన తండ్రి, ప్రముఖ నిర్మాత డి.రామానాయుడిని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి రోజున తన తండ్రి ఉంటే బాగుండేదని భావోద్వేగానికి గురయ్యారు. “ఈ రోజు మిమ్మల్ని మిస్సవుతున్నాం నాన్నా” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అలాగే, “వెంకీ మామ” ఇక మీ అందరిదీ. మీ దగ్గర్లోని థియేటర్లకు వెళ్లి సినిమా చూడండి. పైరసీని ప్రోత్సహించకండి” అని వెంకటేష్ పేర్కొన్నారు. అలాగే చిన్నప్పుడు నాగచైతన్యతో కలిసి తీయించుకున్న ఫొటోను షేర్ చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments