సంక్రాంతి హీరో ఎవరో తేలిపోయింది. టైటిల్ లోనే ఆ సౌండ్ ఉంది. సరిలేరు నీకెవ్వరు అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు దూసుకొచ్చాక ఇక అడ్డేముంది, వేరే అడిగేదేముంది. ఈ సినిమాకు ముందు రిలీజ్ చేసిన టీజర్ అదిరింది. ఇప్పటివరకూ సైలెంట్ ఉన్న సరిలేరు టీం ఇపుడు టీజర్ తో మోత మోగించేసింది. దీంతో సినిమాకు పాజిటి బజ్ ఎక్కడో చుక్కలను తాకుతూ పీక్స్ కి వెళ్ళిపోయింది.

మహేష్ బాబు మూవీ అంటేనే మంచి అంచనాలు ఉంటాయి. ఇక మహేష్ ఏ జోనర్లో అయినా ఫిట్ అయ్యే హీరో. ఆయన కామెడీ కూడా బాగా పండిస్తాడు. సంక్రాంతి హిట్లు కూడా మహేష్ కి చాలా ఉన్నాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ తో అదరగొట్టిన అనిల్ రావిపూడికి అసలు ఎవరూ సరిలేరు. ఆయన కామెడీకి పొట్టచక్కలయ్యేలా నవ్వడమే. దాంతో ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కేస్తుంది, కిక్కిస్తుంది.

అదే విధంగా యూత్ కి కనెక్ట్ అయ్యేలా తీయడంలోనూ అనిల్ రావిపూడి స్పెషలిస్ట్. ఇక కామెడీ చెప్పనక్కలేదు. గ్లామర్ విషయానికి వస్తే అందాల భామ రష్మిక ఉండనే ఉంది. ఆమె గ్లామర్ కి గీతా గోవిందం నీకు అని చెప్పాల్సిందే. ఇక ఈ మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతికి సరిలేరు ఇంకెవరు అని కూడా చెప్పాలి.

నటనలో ప్రకాష్ రాజ్ కి సరి లేరు అని కూడా అనాలేమో. ఇక దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ కి సరిలేరు అని గట్టిగా చెప్పాల్సిందే. మొత్తానికి చూసుకుంటే సంక్రాంతికి మహేష్ మూవీకి సరిలేరు అని గట్టిగా చెప్పేలా టీజర్ అదిరిపోయే రెస్పాన్స్ తో దూసుకువచ్చింది. సో ఆల్ ద బెస్ట్ సరిలేరు చిత్ర యూనిట్ అని మరో మారు గట్టిగా చెప్పాల్సిందే.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments