రెండు రోజుల క్రితం టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఇళ్లు, కార్యాలయాలతో పాటు రామానాయుడు స్టూడియోలో ఐటీ సోదాలు జరిగాయి. అలాగే ఆయన సోదరుడు ప్రముఖ హీరో ‘విక్టరీ’ వెంకటేష్ నివాసంలోనూ సోదాలు చేశారు. ఇక నాని ఇల్లు, ఆఫీసులలోను అధికారులు సోదాలు జరిపారు. అలానే హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ వంటి నిర్మాణ సంస్థలలోను కూడా ఐటీ అధికారులు సోదాలు జరిపారు.

అయితే ఈ గందరగోళం లో కొందరు నాగార్జు ఇల్లు, ఆఫీసులలోను సోదాలు జరిపినట్టు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా.. నాగ్ తన ట్విట్టర్ ద్వారా అసలు విషయాన్ని అందరికి తెలియజేశాడు. నా స్నేహితులు కొందరు మీ ఆస్తులపై ఐటీ శాఖ అధికారలు సోదాలు జరిపారట కదా అని ఫోన్స్ చేసి మరీ అడుగుతున్నారు. నా పై కాని, నా ఆఫీస్ లపై కాని ఎలాంటి సోదాలు నిర్వహించలేదు అని నాగ్ ట్వీట్ ద్వారా అందరికీ క్లారిటీ ఇచ్చారు.

ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో బ్రహ్మాస్త్రా అనే సినిమా చేస్తున్న నాగ్ ఇందులో ఆర్కియాలజిస్టుగా కనిపించనున్నారు. అమితాబ్ బచ్చన్‌, రణ్‌బీర్ కపూర్‌, నాగార్జున అక్కినేని, అలియా భట్‌, మౌనీ రాయ్ ముఖ్య పాత్రలలో తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగాన్ని క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments