ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. మరో వైపున బన్నీ సినిమా పనులతో త్రివిక్రమ్ తీరికలేకుండా వున్నాడు. జనవరిలో త్రివిక్రమ్ ఫ్రీ అయితే, ఫిబ్రవరికి ఎన్టీఆర్ ఫ్రీ అవుతాడు. ఆ తరువాత ఈ ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి రంగం సిద్ధమవుతోంది.

ఇంతకుముందు ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సారి చేయనున్న సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతంగా నెక్స్ట్ లెవెల్ కి  వెళ్లనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాతో ఆయన మార్కెట్ పరిధి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందువల్లనే ఆ స్థాయిలో అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ ను త్రివిక్రమ్ సిధ్ధం చేయనున్నాడట. త్రివిక్రమ్ తన మార్క్  నుంచి బయటికి వచ్చి చేసే ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు అని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments