తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై కార్మిక నేతలు మల్లగుల్లాలు పడ్డారు. ఈ రోజు అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వని నేపథ్యంలో సమ్మెను విరమించాలని కొందరు, కొనసాగించాలని కొందరు వాదించుకున్నారు. తర్వాత విస్తృత స్థాయిలో చర్చించి, మెజారిటీ కార్మికుల మనోగతం ప్రకారం ఏకాభిప్రాయానికి వచ్చారు. సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని ప్రకటించారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.

‘కార్మికులతో చర్చించి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నాం. జేఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వారు చెప్పారు. సమ్మెపై హైకోర్టు తీర్పు కాపీ ఇంకా మాకు అందలేదు. దానిపై న్యాయనిపుణులతో చర్చిస్తాం.’ అని చెప్పారు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. డిమాండ్లు నెరవేరకుండా సమ్మెవిరమిస్తే ప్రభుత్వం మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోదని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు రెండు వారాల్లోగా లేబర్ కోర్టు నిర్ణయం తీసుకునే వరకు సమ్మెను కొనసాగించాలని మరికొందరు చెప్పారు. డిపోల వారీగా కార్మికుల అభిప్రాయాలు తెలుసుకుని మెజారిటీ కార్మికుల నిర్ణయం ప్రకారం సమ్మెను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments