తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యమాల ఖిల్లా ఉస్మానీయా యూనివర్సీటీ ఉద్యమ నాయకుడు జార్జి రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ మాధవ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జార్జ్ రెడ్డి. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ మూవీ ఉద్యమ నాయకుడు జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ మూవీపై అందరికీ భారీగా అంచనాలున్నాయి.

అయితే ఈ మూవీ ప్రమోషన్లలో మెగా ఫ్యామిలీనే ఎక్కువగా ఇన్ వాల్వ్ అవుతుంది. అందరికంటే ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఈ చిత్రం యూనిట్ తెగ వాడేసుకుంటుంది. మొదట ఈ ఆడియో పంక్షన్ ను పవన్ కళ్యాన్ చేతుల మీదుగా జరుగుతుందని ప్రచారం చేసి ఈ మూవీకి తెగ హైప్ తీసుకొచ్చారు.

ఆ తర్వాత పోలీసుల అనుమతి లేకపోవడంతో ఇది కాస్త జరగలేదు. ఇటీవల ఇంటర్వూ ఇచ్చిన హీరో సందీప్ ఇది ముందు పవన్ కళ్యాణ్ కు చెప్పిన కథ. కథ నచ్చి.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కానీ పవన్ కు సమయం లేక నాకు ఈ అవకాశం వచ్చింది అని చెప్పి ఒక్కసారిగా హైప్ ను పీక్ స్థాయిలోకి తీసుకెళ్ళారు. దీన్ని బట్టి ఈ చిత్రం యూనిట్ పవన్ ను తెగ వాడేసుకుంటుంది కదా.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments