‘మనం అడుక్కోవడం లేదు.. మన హక్కులను అడుగుతున్నాం’ అంటున్నాడు యువ కథానాయకుడు సందీప్‌ మాధవ్‌. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘జార్జిరెడ్డి’. సత్యదేవ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. జీవన్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘జార్జిరెడ్డి’ డైలాగ్‌ ప్రోమోను అభిమానులతో పంచుకుంది. ”అడిగింది లేదనకుండా ఇచ్చి ఉంటే భారతంలో భగవద్గీత పుట్టి ఉండేది కాదు. కురుక్షేత్రం జరిగేదీ కాదు..” అంటూ ప్రారంభమైన డైలాగ్‌ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా ట్రైలర్‌ చూసి చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకుల నుంచి యువ కథానాయకులకు వరకూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా రామ్‌ ఈ జాబితాలో చేశారు. ట్రైలర్‌ను చూసిన అనంతరం ఆయన మాట్లాడారు.

”హాయ్‌ అండీ.. ఇప్పుడు ‘జార్జిరెడ్డి’ థియేట్రికల్‌ ట్రైలర్‌ను చూశా. చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఈ సినిమాలో మహతి భిక్ష ఒక మంచి పాత్ర చేసిందని విన్నాను. ఆమెతో పాటు మొత్తం చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌. నవంబరు 22న సినిమా విడుదల కానుంది. మీరంతా తప్పకుండా చూడాలి. యంగ్‌ టీమ్‌ అద్భుతంగా చేసిందని భావిస్తున్నా” -యువ కథానాయకుడు రామ్‌.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments