గత కొన్నిరోజులగా అనారోగ్యంతో బాధ పడుతూ ఆసుపత్రి పాలైన లతా మంగేష్కర్ ఆరోగ్యం క్రమంగా మెరుగువుతోంది. అయితే ఆమె ఇప్పటికే కన్నుమూశారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలయింది. దీంతో ఆమె కోలుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు లతాజీ ఆరోగ్య విషయంలో పుకార్లు పుట్టించొద్దని వారు విజ్ఞప్తి చేసారు. ‘లతా దీదీ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆమె కోలుకుంటున్నారు అంటూ ఆమె ట్విట్టర్ ఖాతా నుంచి ఒక ప్రకటన వెలువడింది కూడా. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. డా.సంధానీ నేత్రుత్వంలోని వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. న్యుమోనియాతో పాటు గుండె సంబంధిత సమస్యలు, ఛాతీ ఇన్‌ఫెక్షన్ కారణంగా లతా హాస్పటిల్‌లో జాయిన్ అయినట్టు చెబుతున్నారు. అయితే ఈ తరహా ప్రచారం సెలెబ్రిటీల బదువులను ఒక్కోసారి సేలేబ్రోటీలను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ మధ్య పరమపదించిన వేణు మాధవ్ ని కూడా బతికి ఉండగానే చంపేసింది మన సోషల్ మీడియా. కొంత మంది వ్యక్తుల అత్యుత్సాహం వలెనే ఇది జరుగుతోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments