కమల్ హాసన్ జీవితం అంతా పరిశ్రమకే అంకితం ఇచ్చిన సంగతి తెలిసిందే. అంచలంచెలుగా స్టార్ హీరోగా ఎదిగారు. అతని జీవితంలో మెజారిటీ భాగం సినిమాతోనే. నటన – దర్శకత్వం – రచన సహా ఇక్కడ అన్ని శాఖల్లోనూ అయన ప్రతిభ చూపారు. అందుకే అయన సేవల్ని పురస్కరించుకొని ఈసారి బర్త్ డే ని స్పెషల్ గా సెలబ్రేట్ చేస్తున్నారు.
నవంబర్ 7 న ఇండస్ట్రీ కెరీర్ పరంగా 60వ బర్త్ డే ని, తన లైఫ్ పరంగా 65వ పుట్టినరోజుని జరుపుకోనున్నారు. అందుకే స్పెషల్ గా ఘనమైన ఏర్పాట్లు సాగుతున్నాయి. నవంబర్ 7న కమల్ హాసన్ రెండు విగ్రహాలని ఆవిష్కరించనున్నారు. అందులో ఒకటి తన తండ్రి డి శ్రీనివాసన్ విగ్రహాన్ని తన స్వస్థలం అయినా పరమకుడిలో ఆవిష్కరిస్తారు. అలాగే తన నట గురువు అయినా లెజెండ్రీ దర్శకుడు బాలచందర్ విగ్రహాన్ని చెన్నై టిటికే రోడ్ లో ఆవిష్కరించనున్నారు.
ది గ్రేట్ డైరెక్టర్ బాలచందర్ కేవలం కమల్ హాసన్ కే కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ – మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలకు గురువు కాబట్టి ఈ విగ్రహావిష్కరణకు ఆ ఇద్దరూ ఎటెండయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక కమల్ హాసన్ పుట్టినరోజు సంబరాలు ఇంత స్పెషల్ గా ప్లాన్ చేసినందుకు తంబీల్లో ఒకటే ఉత్సాహం వెల్లివిరుస్తోంది. మూడు రోజుల పాటు ఈ సంబరాలు జరగనున్నాయి.