టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ నగరంలోని ప్రసాద్ ఐమ్యాక్స్ లో సందడి చేశారు. శుక్రవారం అయన నిర్మాతగా వ్యవహరిస్తున్న మీకు మాత్రమే చెప్తా సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ నేటి ఉదయం ఐ మాక్స్ కు చేరుకొని అక్కడి టికెట్ కౌంటర్ లో కూర్చొని వచ్చిన సినీ ప్రేక్షకులకు టికెట్లును విక్రయించారు. దాంతో టిక్కెట్ కౌంటర్ లో విజయ్ ను చూసిన అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు.
అంతేకాకుండా విజయ్ ను చూడటం చాలా సంతోషంగా ఉందని పలువురు అభిమానులు తెలిపారు. పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్ భాస్కర్. తాజాగా అయన హీరోగా పరిచయం అవుతున్న సినిమా మీకు మాత్రమే చెప్తా. షమీర్ సుల్తాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు విజయ్ దేవరకొండ నిర్మాత. అనసూయ, అభినవ్ గౌతమ్ కీలక పాత్రల్లో నటించారు.