ఇప్పుడు ఎక్కడ చూసినా విపరీతంగా ట్రేండింగ్ అవుతున్న యాడ్ సాయి సూర్య డవలపర్స్ యాడ్ . టాలీవుడ్ సూపర్ స్టార్ కుటుంబం మొత్తం ఈ యాడ్ లో కనిపించడం విశేషం . దీనితో ఆ యాడ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది . అయితే ఇలాంటి యాడ్స్ వెనకాల గొప్ప క్రియేటివిటీ తో కూడిన దర్శకులు ఉంటారు . తెలుగులో ఇప్పటికే కొన్ని వందల పై చిలుకు హిట్ యాడ్స్ ను చేసి వ్యాపారుల అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించిన యాడ్ దర్శకుడు యమున కిషోర్ . సంస్కారవంతమైన సోప్ టాగ్ లైన్ తో యాడ్స్ లో ఒక కొత్త వరవడి నాంది పలికి xxx సోప్ వారి ఉన్నతికి చాలా తోడ్పడ్డారు . ఆ తరువాత అనేక పెద్ద పెద్ద కంపెనీలకు ఆయన యాడ్స్ రూపొందించారు.

రీసెంట్ గా బాబాయ్ మీడియా తో తన మనసులోని భావాలను పంచుకున్నారు యమున కిషోర్ . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇప్పటివరకు ఐదు వందల పైన యాడ్స్ చేశానని , అందులో బాగా ఆదరణ పొందినవి నాలుగు వందల పైగా ఉంటాయని , ఇంకా తాను గుంటూరు లో ఉన్నప్పుడు చేసిన వాటితో కలిపితే వెయ్యికి పై చిలుకు ఉంటాయని ఆయన తెలిపారు . ఇంకా అనేక ఆసక్తికర విషయాలను ఆయన బాబాయ్ మీడియా ప్రత్యేక ఇంటర్వ్యూ లో వెల్లడించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments