సాధారణంగా వాహనాలపై రవాణా శాఖ వారు కేటాయించిన నెంబర్ ఉంటుంది . అలా ఉండకుండా ఇంకెలా ఉన్నా చట్టం దృష్టిలో వాహన యజమాని శిక్షార్హుడు . ఇది అందరికీ తెలిసిన విషయమే . అయితే తాజాగా ఒక వ్యక్తి తన కారుపై పై ఉంచిన నెంబర్ ప్లేట్ ను చూసి పోలీసులు షాక్ కు గురయ్యారు . వివరాలలోకి వెళితే అక్టోబర్ 19 వ తారీఖున జీడిమెట్ల పైపు లైన్ రోడ్డులో ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు జరుగుతున్న సమయంలో అటుగా వెళ్తున్న కారును పోలీసులు ఆపారు . ఆ కారు నెంబర్ ప్లేటు పై AP CM YS JAGAN అని ఉండడంతో షాక్ కు గురయ్యారు . ఇలా నెంబర్ కాకుండా ఇలా ఎందుకు చేశావంటూ పోలీసుల ప్రశ్నించగా,టోల్ రుసుం మినహాయింపు కోసం ఇలా చేసినట్లు కారు యజమాని ముప్పిడిహరి రాకేశ్ చెప్పాడు .ఆ తర్వా పోలీసులు ఆ కారును సీజ్ చేసి.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు వివరాలను ట్రాఫిక్ సీఐ వెల్లడించారు. సదరు కారు యజమాని స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అని పోలీసులు తెలిపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments