టాలీవుడ్ పవర్ స్టార్ , జనసేనాని; పవన్ కల్యాణ్ మళ్ళీ నటించనున్నారన్న వార్తలు ఈమధ్య బాగా వైరల్ అయ్యింది . దీనితో పవన్ అభిమానులు కూడా తమ అభిమాన కథానాయకుడిని మళ్ళీ వెండితెరపై చూసుకోవడానికి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు . పవన్ మళ్ళీ నటిస్తారన్న ప్రచారం ఊపందుకువడంతో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు పవన్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారట . బాలీవుడ్ లో బిగ్ బీ , తాప్సీ ప్రధాన పాత్రలను పోషించిన పింక్ సినిమా ఎంతగానో విజయం సాధించిన విషయం తెలిసినదే . ఈ సినిమాను తమిళంలో అజిత్ , శ్రద్ధ శ్రీనాథ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కించడంతో అక్కడ కూడా ఈ పింక్ సినిమా విజయం సాధించింది . ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన హక్కులు నిర్మాత దిల్ రాజు దక్కించుకోవడంతో ఆయన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ నటిస్తే బాగుంటుందని భావిస్తున్నారట . అందుకు పవన్ తనకు కేవలం 25 రోజుల సమయం ఇస్తే తాను సినిమా పూర్తిచేస్తానని , ఈ విషయాన్ని త్రివిక్రమ్ ద్వారా పవన్ కు తెలియజేసారని సమాచారం . తాను ఇక నటించనని ప్రకటించిన పవన్ ఈ సినిమా చేస్తారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments