బిగ్ మీట్ జరగబోతోంది. ఏపీ సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి.. సమావేశం కానున్నారు. వీరిద్దరి మీటింగ్‌పై.. సినీ, రాజకీయవర్గాల్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల అంతటా ఆసక్తి నెలకొంది. సైరా సినిమా గురించే చిరంజీవి.. సీఎం జగన్‌ను కలవనున్నారా.. లేక ఇంకేవైనా పొలిటికల్ రీజన్స్ ఉన్నాయా అన్న దానిపై స్టేట్‌లో.. హాట్ టాపిక్ నడుస్తోంది.

సోమవారం(అక్టోబర్ 14,2019) మధ్యాహ్నం 1 గంటకు సీఎంతో చిరంజీవి భేటీ కానున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇద్దరూ కలిసి లంచ్ చేస్తారు. ఇప్పుడందరి కళ్లూ వీరిద్దరి లంచ్ మీట్‌పైనే ఉన్నాయి. ఈ మీటింగ్‌లో.. చిరు, జగన్ ఏం చర్చిస్తారనే దానిపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జగన్ సీఎం అయ్యాక చిరంజీవి తొలిసారి ఆయనతో భేటీ కాబోతున్నారు. దీంతో జగన్-చిరు సమావేశం సినీ, రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ భేటీపై తెలుగు రాష్ట్రాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

సైరా నరసింహారెడ్డి సినిమాని చూడాలని చిరంజీవి సీఎం జగన్ ని కోరనున్నారని సమాచారం. అలాగే సీఎంగా ఎన్నికైన జగన్ కు అభినందనలు తెలపనున్నారని తెలుస్తోంది. ఏపీలో సైరా చిత్రం ప్రత్యేక షోలు వేసేందుకు జగన్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకుగాను చిరంజీవి ధన్యవాదాలు తెలపనున్నారు. అలాగే సినిమాకు ప్రభుత్వం తరపున పన్ను మినహాయింపు కోరాలని ఆలోచనగా తెలుస్తుంది. జగన్ సీఎం అయ్యాక ఇప్పటివరకు చిరు కలిసింది లేదు.

సైరా మూవీ సక్సెస్‌తో చిరంజీవి మంచి జోష్‌లో ఉన్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరాను.. సినీ, రాజకీయ ప్రముఖులకు ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యే.. తెలంగాణ గవర్నర్ తమిళిసై ఫ్యామిలీకి స్పెషల్ షో వేసి మూవీ చూపించారు మెగాస్టార్. జగన్‌కు కూడా సినిమా చూపించబోతున్నారని సమాచారం. సైరా సినిమా గురించి మాత్రమే జగన్‌తో భేటీ అవుతున్నట్లు చిరంజీవి కూడా క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ.. వీళ్లిద్దరూ తాజా రాజకీయాలపై కూడా చర్చిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

వాస్తవానికి కొన్ని రోజుల ముందే సీఎం జగన్ తో చిరు భేటీ కావాల్సి ఉంది. అయితే ఆ భేటీ వాయిదా పడింది. శుక్రవారం(అక్టోబర్ 11,2019) ఉదయం 11 గంటలకు ఇరువురూ భేటీ కావాల్సి ఉండగా..అపాయింట్ మెంట్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో సమావేశం వాయిదా పడింది. జగన్ సీఎం అయ్యాక చిరంజీవి తొలిసారి ఆయనతో భేటీ కావాలని నిర్ణయించుకుని అపాయింట్ మెంట్ తీసుకున్నారు.

జగన్ సీఎం అయ్యాక టాలీవుడ్ పెద్దలెవరూ జగన్ ని కలవ లేదు. దీనిపై వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్లో దిల్ రాజు, అశ్వినీదత్ వంటి నిర్మాతలు జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించినా.. అపాయింమెంట్ ఇవ్వలేదనే టాక్ కూడా వినిపించింది. తాజాగా సీఎం జగన్ అపాయింట్‌మెంట్ చిరంజీవి కోరడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలిసి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా స్పెషల్ షో వేసి చూపించారు చిరంజీవి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments