చెడును వధించి మంచిని గెలిపించిన రోజు దసరా. దసరా రోజున ప్రతి ఒక్కరు చెడుకు ప్రతీకగా భావించే రవాణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రవాణ ప్రతిమను తయారు చేసి దానిలో మందుగుండు పేర్చి బాణాలతో కొడతారు. అలా కొట్టినప్పుడు బాణాసంచా పేలి రావణుడు దహనమైపోతాడు. ఇలా రావణ దహనంతో మనిషిలోని చెడు కూడా దహనం కావాలి అన్నది ప్రతి ఒక్కరి ఇద్దేశ్యం.

ఇదిలా ఉంటె, దసరా రోజున హడావుడిగా ఇదొక మంచి పని చేయాలని హడావుడి చేస్తుంటారు. దసరా రోజున హడావుడిగా కొన్ని పనులు చేయకూడదు. ఆలా చేస్తే.. మనిషి చిక్కుల్లో పడతారు. దురాశ రోజున చేయకూడని ఆ పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటిగా ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన విషయాన్ని తీసుకుంటే.. ఆర్ధికంగా బాగుండాలని అందరు అనుకుంటారు. తప్పులేదు. అయితే, దసరా రోజున ఆర్ధికంగా తీసుకునే నిర్ణయాలు ఒకటికి నాలుగు సార్లు అలోచించి తీసుకోవడం మంచింది.

చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని క్రెడిట్ కార్డులు వంటివి వాడి విపరీతంగా ఖర్చులు చేయడం వలన చేసిన అప్పులకు శిక్షణగా వడ్డీలు కట్టాల్సి వస్తుంది. అవి మొత్తం తీరిపోయే సరికి నడ్డి విరుగుతుంది. అందుకే అప్పులు చేయకుండా, ఉన్న డబ్బును భీమా లేదా ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయండి. ఆలా చేయడం వలన డబ్బు ఆదా అవుతుంది.

ప్రతి మనిషి ఆనందంగా జీవించాలి అంటే… ఒక క్రమపద్ధతి అవసరం. డబ్బు ఖర్చు చేసే విషయంలో ఆర్ధిక క్రమశిక్షణను పాటించాలి. అప్పుడే జీవితంలో ఎదుగుదల ఉంటుంది. కాబట్టి దసరా నుంచి ఆర్ధికంగా క్రమశిక్షణను అలవర్చుకోండి. అదే జీవితానికి భరోసా ఇస్తుంది. ఇక ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే.. ఆ కంపెనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకొని, అందులో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని అలోచించి పెట్టుబడులు పెట్టాలి. లేదంటే దివాళా తీయడం ఖాయం.

ప్రతి ఒక్కరికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. దానిని అనుసరించి జీవనం ఉండాలి. దానికి తగ్గట్టుగా పెట్టుబడులు పెడుతుండాలి తప్పించి అన్నింటిలో పెట్టుబడులు పెట్టుకుంటూ పోవడం వలన అర్ధం లేదు. కాబట్టి పెట్టుబడులు పెట్టె ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచింది పెట్టడం మంచిది. ఇలా చేయడం వలన ఆర్ధికంగా జీవితానికి భరోసా లభిస్తుంది. చక్కని జీవనం లభిస్తుంది. కాబట్టి తప్పుడు మార్గంలో నడవకుండా సక్రమమైన మార్గంలో నడిచేందుకు ప్రయత్నం చేయండి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments