మెగా స్టార్ మేనల్లుడు గా తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించి తన నటనతో ప్రేక్షకుల మెప్పు పొందారు సాయి ధరమ్ తేజ్ . ఇటీవల విడుదలైన చిత్రలహరి తో హిట్ అందుకొని మంచి జోష్ లో ఉన్నారు సాయి ధరమ్ తేజ్ . అయితే ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం గురుంచి అప్డేట్ వచ్చింది . కొత్త డైరెక్టర్ సుబ్బు దర్శకత్వంలో “సోలో బ్రతుకే సో బెటర్” అనే టైటిల్ తో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మాణంలో రూపొందబోతోంది . ఈ చిత్రంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కుర్రాళ్లను తన వైపు తిప్పుకున్న నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది . ఈ విషయాన్ని సాయి ధరమ్ తేజ్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా పంచుకున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments