దాదాపు రెండు దశాబ్దాల క్రితం తన అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకున్న లేడీ సూపర్ స్టార్ విజయశాంతి . ఆమె వెండితెరకు దూరమై దాదాపు 13 సంవత్సారాలు అయ్యింది . ఆమె ఇంత గ్యాప్ తరువాత్త మహేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు నటిస్తున్నారు . ఈ చిత్రం లో ఆమె లెక్చరర్ గా కనిపించన్నారు . ఈ చిత్రం ఎక్కువ శాతం కర్నూల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది . హైదరాబాద్ శివారులలో దాదాపు 30 ఎకరాలలో కర్నూల్ కు సంబందించిన సెట్ వేసి చిత్రం షూటింగ్ చేస్తున్నారు . అనిల్ రావిపూడి ఆర్టిస్ట్స్ అందరికి ఇస్తున్న గౌరవం చూసి విజయశాంతి ఫిదా అయ్యారట . అంతేకాక ఆమె అనిల్ చేయబోయే మరుసటి సినిమా ఎఫ్ 3 లో నటించడానికి ఒప్పుకున్నారు . ఇంతకముందు చాలా మంది విజయశాంతి ని తమ సినిమాలలో నటింప చేయాలని ప్రయత్నించినా ఆమె అంగీకరించలేదు , అలాంటిది అనిల్ రావిపూడి రూపొందిస్తున్న వరుస రెండు సినిమాలలో ఆమె నటించడం అంటే అనిల్ కు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments