టైటిల్ చూసి అల్లుడికి మామయ్యా గిఫ్ట్ ఇవ్వడంలో వింతేముంది అనుకుంటున్నారా . ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ . దాదాపు రెండు మూడు సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా టైం లో ఏ ఎం రత్నం నిర్మాణంలో ఒక సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు . ఈ మేరకు కొంత మేర అడ్వాన్స్ కూడా పవన్ తీసుకున్నారు . ఆ సినిమా కు సంబందించిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . అయితే అజ్ఞాతవాసి రిలీజ్ తరువాత తాను ఇక సినిమాలు చేయబోనని , తన జీవితం ప్రజాసేవ కే అంకితమని ఆయన చాలా సార్లు ప్రకటించారు . అయితే ఈ మధ్య సినిమా ఫంక్షన్స్ లో పవన్ చురుకుగా పాల్గొనడంతో మళ్ళీ ఆయన సినిమా చేయబోతున్నారని ఫిలిం నగర్ లో టాక్ . ఆయన సరే అంటే చేయడానికి చాలా మంది దర్శకులు క్యూలో ఉన్నారు . ఈ ప్రచారం ఊపందుకోవడంతో ఏ ఎం రత్నం మళ్ళీ పవన్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నారు . ఇది గమనించిన పవన్ సినిమా తనతో కాకుండా తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో తీయవలసినదిగా ఏ ఎం రత్నం కు సూచించారని ఆయన కూడా ఒప్పుకున్నారని సమాచారం . చాలా కాలం తరువాత చిత్రలహరి సినిమా తో హిట్ కొట్టి మంచి జోష్ లో ఉన్నారు సాయి ధరమ్ తేజ్ . సాయి ధరమ్ కూడా తన మామ మీద ఉన్న ప్రేమని తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు .
అయితే ఇప్పుడు ఏ ఎం రత్నం సాయి ధరమ్ తో చేయబోయే సినిమాను ఎవరు దర్శకత్వం చేయబోతున్నారనేది వేచి చూడాలి .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments