ఆయన తెలుగు జాతి గర్వించే నటుడు : చిరంజీవి

672

విలక్షణమైన నటనతో , అద్భుతమైన ఆహార్యంతో , తనదైన డైలాగ్ డెలివరీ తో అందిరినీ ఆకట్టుకున్న మహానుభావుడు ఎస్ వీ రంగారావు గారు . పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని కె .యన్ రోడ్డులో 9. 3 అడుగుల ఎస్ వీ రంగారావు విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు .

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ నా అభిమాన నటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఏడాది క్రితం నన్ను కోరారు. అయితే సైరా సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండటంతో కుదరలేదు. ఇన్నాళ్లకు ఆ అవకాశం లభించింది . ఎస్వీ రంగారావుగారిని చూసే నేను నటుడిని అవ్వాలని మద్రాస్‌ వెళ్లాను . ఈ రోజు మీ ముందు ఇలా నిలబడగలిగాను. విగ్రహావిష్కరణకు ప్రభుత్వ అనుమతులు తీసుకుని, చొరవ తీసుకున్న ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు నా ప్రత్యేక ధన్యవాదాలు . నా జిల్లాకు వచ్చిన నన్ను అక్కున చేర్చుకున్న అందరికీ కృతజ్ఞతలు . అలాగే సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు . ఎస్వీ రంగారావుగారి ఆశీస్సులు ఎప్పటికీ నాకు ఉంటాయి.’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ స్వీఆర్‌ వంటి గొప్ప నటుడు తెలుగువారు కావడం మన అదృష్టమని, ఆయన నటనే తనకు ప్రేరణ అని అన్నారు . ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here